Asianet News TeluguAsianet News Telugu

మ‌హేష్ బాబు నెక్ట్స్ మూవీ హిరోయిన్ ఎవ‌రో తెలుసా

  • టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ హిరో మ‌హేష్ బాబు
  • ఎంత గొప్ప‌పేరు ఉన్న‌సింపుల్ గా ఉండ‌టం ఆయ‌న స్టైల్
  • ప్ర‌స్తుతం స్పైడ‌ర్ మూవీతో బిజీగా ఉన్న సూప‌ర్ స్టార్
  • త‌న నెక్ట్స్ మూవీలో ఇలియానా  నే హిరోయిన్ గా కావాలంట
maheshbabu next movie heroine Ileana

 

టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకున్న మహేష్ బాబు  ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి ఓ దర్శకుడితో సినిమాను ఒకే చేశాడంటే చాలు మహేష్ ఇక ఆ దర్శకుడికి అస్సలు అడ్డు చెప్పాడు. ఎంత స్టార్ హోదా ఉన్నా ఏ రోజూ క్రమశిక్షణను తప్పకుండా కరెక్ట్ టైమ్ కి షూటింగ్ కి హారవుతాడని కూడా పేరుంది.

 

అయితే అలాంటి మహేష్ తాను నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా  తాను చెప్పిన నటిని ఎంచుకోవాలని తన అభిప్రాయాన్ని చెప్పడట. ఆమె ఎవరో కాదు తన కెరీర్ బెస్ట్ చిత్రంలో నటించిన ఇలియానా. ఆమె అయితే సినిమాకి కరెక్ట్ గా సెట్ అవుతుందని మహేష్ చెప్పాడని టాక్. ఇంతకుముందు వారి కలయికలో పోకిరి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న తన 25వ సినిమాకి మహేష్ ఇలియానాని ఎంచుకున్నాడని రూమర్లు వెలువడుతున్నాయి.

 

కానీ చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా వెలువడలేదు. ప్రస్తుతం మహేష్ స్పైడర్ చివరిపాట చిత్రీకరణలో ఉన్నాడు. ఇక ఆ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  అలాగే ఇలియానా కూడా తన లేటెస్ట్ మూవీ బాద్షాహో యాజూజువల్ ఫ్లాప్ కావడంతో ఆ బాధలో ఉంది. మరి టాలీవుడ్లో ఆమెకు రి-ఎంట్రీ ఛాన్స్ నిజంగా దక్కుతుందో లేదో చూడాలి

Follow Us:
Download App:
  • android
  • ios