మహేష్‌ హీరోయిన్‌ అమృతా రావు తల్లి అయ్యారు. ఆమె ఆదివారం పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అమృతారావు మీడియా ప్రతినిధి, కుటుంబ సభ్యులు వెల్లడించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఇటీవల అమృతారావు, ఆమె భర్త ఆర్జే అన్మోల్‌ బేబిబంప్స్ తో ఉన్న ఫోటోని సోషల్‌ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. తనకి తొమ్మిదో నెల అని వెల్లడించింది. 

ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉండి, ఒకేసారి తనకి తొమ్మిదో నెల అని ప్రకటించడంతో ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. అయినప్పటికీ తేరుకుని ఆమెకి అభినందనలు తెలిపారు. అన్నట్టుగానే పండంటి మగబిడ్డకి అమృతారావు జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. 2016లో ప్రముఖ ఆర్‌జే అన్మోల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమృతా. వీళ్లిద్దరు ఏడేళ్లపాటు కలిసి ప్రేమాయణం సాగింది మ్యారేజ్‌ చేసుకున్నారు. పెళ్ళి తర్వాత అమృతా రావు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 

ఇక అమృతారావు విషయానికి వస్తే.. ఆమె తెలుగులో మహేష్‌ సరసన `అతిథి` సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. ఒక్క సినిమాతోనేనైనా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో `వివాహ్` వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది.