గతంలో ఎప్పుడూ ఈసినిమాపై మహేష్‌ స్పందించలేదు. తొలిసారి ఆయన రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మహేష్‌ తన `గుంటూరు కారం` సినిమాపై మాట్లాడారు. 

మహేష్‌బాబు నటిస్తున్న `గుంటూరు కారం` చిత్రంపై చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దర్శకుడు త్రివిక్రమ్‌కి, హీరో మహేష్‌బాబుకి పడటం లేదని, ఇద్దరు మాట్లాడుకోవడం లేదని, దీని కారణంగా షూటింగ్‌ ఆలస్యమవుతుందంటూ వార్తలొచ్చాయి. అదే సమయంలో అంతకు ముందు తీసిన యాక్షన్‌ సీన్లు నచ్చడం లేదని మహేష్‌ అసంతృప్తి చెందారట. దీంతోపాటు పాటల విషయంలోనూ ఆయన సంతృప్తిగా లేరని టాక్. తన బర్త్ డే సందర్భంగా ఓ పాటని విడుదల చేయాలనుకున్నారు. కానీ మహేష్‌కి నచ్చకపోవడంతో ఆ పని చేయలేకపోయారు. 

ఇటీవల ఫ్యామిలీతోపాటు లండన్‌ టూర్‌ వెళ్లాడు మహేష్‌బాబు. దాదాపు పదిహేను రోజులపాటు వెకేషన్‌లో రిలాక్స్ అయ్యారు. అదే సమయంలో కొన్ని తన వ్యక్తిగత వ్యవహారాలను కూడా సెట్‌ చేసుకుని వచ్చారు. దీంతో వెంటనే `గుంటూరు కారం` సినిమాకి సంబంధించి షూటింగ్‌ ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక అప్‌ డేట్ లేదు. దీంతో సినిమాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాపై ఏకంగా మహేష్‌బాబు స్పందించడం విశేషం. 

గతంలో ఎప్పుడూ ఈసినిమాపై మహేష్‌ స్పందించలేదు. తొలిసారి ఆయన రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మహేష్‌ తన `గుంటూరు కారం` సినిమాపై మాట్లాడారు. సంక్రాంతికి వస్తుందని తెలిపారు. `సంక్రాంతికి వస్తుందండి, సంక్రాంతికి రిలీజ్‌ అవుతుంది. మీ అందరు హ్యాపీ అవుతారు` అని తెలిపారు. ఈ వ్యాఖ్యలను నిర్మాత నాగవంశీ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 2024 జనవరి 12న పక్కాగా వస్తున్నామనే విషయాన్ని ఆయన తెలిపారు. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. 

మహేష్‌ స్పందించ అనేక అనుమానాలకు, అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయ్యింది. అదే సమయంలో రూమర్స్ కి చెక్ పెట్టినట్టయ్యింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో `గుంటూరు కారం` షూటింగ్‌ జరుగుతుందట. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో సుమారు నాలుగు కోట్లతో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతుందట. ఇందులో మహేష్‌బాబు, ప్రకాష్‌ రాజ్‌తోపాటు ప్రధాన తారాగణం పాల్గొంటుందట. పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. గ్యాప్‌ లేకుండా కంటిన్యూగా లాంగ్‌ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. 

Scroll to load tweet…

సినిమాలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయం తెలిసిందే. అందులో భాగంగా సినిమాటోగ్రాఫర్‌ మారిపోయారు. మొదట సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌ ఉండగా, ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో మనోజ్‌ పరమహంస కెమెరా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. శ్రీలీల ఆమె స్థానానికి ప్రమోట్‌ అయ్యారు. అలాగే మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా ఎంపికైంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి సినిమా రాబోతుంది.