మహేష్‌బాబు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ని అభినందించారు. ప్లాస్మా డొనేషన్‌కి సంబంధించి ఆయన నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను మహేష్‌ ప్రశంసించారు. తన అభిమానులను కూడా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు. రేపు(ఆదివారం) తన బర్త్ డే కావడంతో ఈ సందర్భాన్ని పురస్కంచుకుని ఈ విషయాన్ని మహేష్‌బాబు తన ఫ్యాన్స్ కి తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్లాస్మా డొనేషన్‌ ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ అవేర్నెస్‌తో ముందుకొచ్చి  ప్లాస్మా డొనేట్‌ చేసిన వారిని అభినందిస్తున్నారు. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడటానికి దోహదపడే ప్లస్మాను డొనేట్‌ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నా బర్త్ డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్‌ అవేర్నెస్‌ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా` అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన చెబుతూ, ఈ ప్లాస్మా డొనేషన్‌ అవేర్నెస్‌ ప్రోగ్రామ్‌ను పోలీసు డిపార్ట్ మెంట్‌ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఎంటైర్‌ పోలీస్‌ డిపార్ట్ మెంట్‌ కి అభినందనలు. ముఖ్యంగా అనుక్షణం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, ఈ ప్లాస్మా డొనేషన్‌ గురించి ప్రజలకు చెబుతూ ఎందరో ప్రాణాల్ని కాపాడుతున్న సీపీ సజ్జనార్‌ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. ప్లాస్మా డొనేట్‌ చేయండి. ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టండి` అని ట్విట్టర్‌ ద్వారా మహేష్‌ పేర్కొన్నారు. 

మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో సందడి చేసిన మహేష్‌.. ఇప్పుడు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. మహేష్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ ట్రాక్‌ని ఆదివారం విడుదల చేయనున్నారని టాక్‌. దీనికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. నిన్న మహేష్‌పోస్ట్ కి తమన్‌ స్పందిస్తూ, `బ్రదర్‌` అని పిలవడం మహేష్‌ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.