గంట ఆలస్యంతో సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు మహేష్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాని ప్రకటించారు. `ssmb28` వర్కింగ్‌ పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని నిర్మించబోతుంది. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)నిర్మాత. నిజానికి ఈ సినిమాని ఈ సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. కానీ వర్క్ కంప్లీట్‌ కాలేదని కాస్త ఆలస్యమవుతుందని చెప్పి షాక్‌ ఇచ్చింది. గంట తర్వాత చిన్న వీడియో రూపంలో ఈ సినిమాని ప్రకటించారు. `అతడు`, `ఖలేజా` తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 11ఏళ్ల తర్వాత ఈ సినిమా రాబోతుందని తెలిపింది యూనిట్‌. 

త్వరలోనే ఈ సినిమాని ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మార్నింగ్‌ నుంచి సోషల్‌ మీడియాలో యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎట్టకేలకు సినిమాని ప్రకటించారు. 

ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌.. మహేష్‌ కంటే ముందు ఎన్టీఆర్‌తో `ఎన్టీఆర్‌30`ని తెరకెక్కించాల్సి ఉంది. అనుకోని కారణాలతో ఈ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. ఎన్టీఆర్‌.. కొరటాలతో తన 30వ సినిమాని ప్రకటించారు.దీంతో త్రివిక్రమ్‌.. మహేష్‌తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. అందులో నిజమెంతా అనేది సాయంత్రం నాలుగు గంటలకు తేలనుంది. మరోవైపు త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా కానుంది.  ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ కథానాయికగా, పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.