ఒకే ఒక్క సినిమా మేడమ్ గారి కెరీర్ ను మార్చేసింది. ఛలో సినిమాతో సైలెంట్ గా బాక్స్ ఆఫీస్ హిట్టందుకొని గీతగోవిందం సినిమాతో ఎవరు ఊహించని విధంగా ఇండస్టీ రికార్డ్ ను అందుకుంది రష్మిక మందన్న. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ద్రుష్టి స్టార్ హీరోలపై పడింది. బడా దర్శకులు కూడా రష్మిక ని ఫస్ట్ చాయిస్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అయితే రష్మిక మాత్రం కథలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేషే మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

నెక్స్ట్ కుదిరితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సూపర్ స్టార్ రెడీగా ఉన్నారు. అందుకే ముందుగానే దర్శకుడు గీత గోవిందం హీరోయిన్ కు స్క్రిప్ట్ ను వినిపించినట్లు సమాచారం. రష్మిక కూడా కథకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ అనిల్ సబ్జెక్ట్ పై నమ్మకంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో సినిమాపై ఒక స్పెషల్ ప్రకటన విడుదల చేయడానికి మహేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.