బాలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు అమీర్ ఖాన్ పుట్టిన రోజు నేడు. 1965 మార్చ్ 14న జన్మించిన అమీర్ ఖాన్ 56వ ఏట అడుగుపెట్టారు. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, చిత్ర ప్రముఖులు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ఆయన భవిష్యత్ బాగుండాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ కూడా అమీర్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. 


మహేష్ ట్విట్టర్ వేదికగా అమీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఆయనకు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ కలగాలని కోరుకున్నారు. ప్రతి విషయంపై స్పందించే మహేష్ ఆయన చూసిన చిత్రాల గురించి కూడా ట్వీట్ చేస్తారు. ఇటీవల విడుదలైన జాతి రత్నాలు మూవీపై మహేష్ ట్వీట్ చేశారు. హీరో నవీన్ పోలిశెట్టితో పాటు చిత్ర యూనిట్ ని పొగుడుతూ ట్వీట్ చేశారు. ఆయన ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. 


కాగా అమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా పేరుతో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి హిందీ రీమేక్ గా లాల్ సింగ్ చద్దా తెరకెక్కుతుంది. కరీనా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వియాకామ్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.