మహేష్‌-రాజమౌళి సినిమా మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. చత్రపతి శివాజీగా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఓ మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తుంది. 

mahesh will act as chatrapathi sivaji role in rajamouli movie ? arj

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని లాక్‌డౌన్‌ సమయంలో రాజమౌళి ప్రకటించారు. దీన్ని కే.ఎల్‌ నారాయణ నిర్మిస్తారని వెల్లడించారు. దీంతో మహేష్‌-రాజమౌళి సినిమాకి సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇటీవల కొంత గ్యాప్‌ తర్వాత మరోసారి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

తాజాగా ఓ మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తుంది. మహేష్‌ ప్రస్తుతం పరశురామ్‌తో  `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇటీవల దుబాయ్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మరోవైపు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌` అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో `సర్కారు వారి పాట` సినిమా పూర్తి కాగానే రాజమౌళి సినిమా సెట్‌పైకి వెళ్లనున్నట్టు, ఈ మేరకు ప్లాన్‌రెడీ అవుతున్నట్టు టాక్. 

ఇదిలా ఉంటే తాజాగా `ఆకాశమే నీ హద్దురా` ఫేమ్‌ సుధా కొంగర ప్రసాద్‌తో మహేష్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. సుధాకొంగర ఇటీవల మహేష్‌కి కథ చెప్పారని, దీనిపై ఆయన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు. మరి రాజమౌళి సినిమా కంటే ముందు ఈ చిత్రాన్ని చేస్తారా? లేక నో చెబుతారా ? అన్నది సస్పెన్స్ నెలకొంది. అయితే మహేష్‌-రాజమౌళి సినిమాకి సంబంధించిన మరో అప్‌డేట్‌ వైరల్‌ అవుతుంది. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందించబోతున్నట్టు సమాచారం.  రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథ రెడీ చేస్తున్నారట. 

ఇందులో మహేష్‌ ఛత్రపతి శివాజీగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మహేష్‌తో `జేమ్స్ బాండ్‌` తరహా కథని రూపొందిస్తానని గతంలో హింట్‌ ఇచ్చారు రాజమౌళి. మరి తాజా వార్తల్లో నిజమెంతా, అసలు ఎలాంటి కథతో వీరి ప్రాజెక్ట్ ఉంటుంది? ఎప్పుడు ఉంటుందనేది అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ వస్తుంది. కానీ ఈ క్రేజ్‌ అప్‌డేట్‌తో మహేష్‌ అభిమానులు సంబరపడుతున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీగా మహేష్‌ నటిస్తే అదో పెద్ద సంచలనమే అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios