టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నటి నమ్రతా శిరోద్కర్‌ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్‌ ప్రేమని మొదట కృష్ణా అంగీకరించకపోవడంతో మహేష్‌, నమ్రతా సైలెంట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు. ఓ గొప్ప, సంపన్న ఫ్యామిలీకి చెందిన వారసులైనప్పటికీ మహేష్‌, నమ్రత చాలా సింపుల్‌గా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరి ప్రేమని కృష్ణ అంగీకరించారు. `వంశీ` సినిమాలో ప్రేమలో పడ్డ ఈ జంట 2005లో ఒక్కటయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా నమ్రత రెండు అరుదైన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో తమ పెళ్ళి ఫోటో, వారి కుటుంబ సభ్యులతో ఉండగా, మరోకటి నమ్రత తల్లిదండ్రులది. మ్యారేజ్‌ అనంతరం వారిద్దరి తల్లిదండ్రులతో దిగిన ఫోటో అది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, `అప్పటికీ ఇప్పటి పర్‌ఫెక్ట్ పిక్చర్‌. అసాధారణమైన యాధృచ్చికం. స్వర్గంలో నిర్ణయించిన వివాహలు` అని పేర్కొంది. తమ పెళ్ళి ఫోటోల్లో సూపర్‌ స్టార్‌ కృష్ణ, ఇందిరాదేవితోపాటు నమ్రత తల్లిదండ్రులున్నారు. 

నమ్రత ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో ఆమె అభిమానులు, మహేష్‌ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలను  వైరల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు.