'కోడిముందా గుడ్డుముందా' అనే ప్రశ్న మనకు కొంచెం కామెడీగా అనిపించినా, ఇది చిక్కు ప్రశ్నే. జీవపరిణామ క్రమం గురించి చెప్పిన డార్విన్ మాత్రమే దీనికి సరైన సమాధానం చెప్పగలడు. ఐతే ఈ చిక్కు ప్రశ్నకు మహేష్ వైఫ్ నమ్రత ఆసక్తికర సమాధానం చెప్పారు. అది కూడా 1993 ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ వేదిక సాక్షిగా. ఫైనల్ కి చేరిన ముగ్గురు యువతులలో నమ్రత శిరోద్కర్ ఒకరు. ఈ ముగ్గురిని జడ్జెస్ మెలికతో కూడిన కోడిముందా గుడ్డుముందా? అనే ప్రశ్నను అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు నమ్రత కోడి ముందు అని చెప్పారు. దానికి కారణం కోడి లేకపోతే గుడ్డు లేదు. కాబట్టి కోడే ముందు అని చెప్పారు. 

మరి నమ్రత సమాధానికి న్యాయనిర్ణేతలు ఇంప్రెస్ అయ్యారేమో కానీ, విజేతగా ఆమెను నిర్ణయించి, ఫెమీనా మిస్ ఇండియా  కిరీటంతో సత్కరించారు. దాదాపు 27ఏళ్ల నాటి ఆ వీడియోను నమ్రత తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక 1998లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నమ్రత 2000లో మహేష్ సరసన వంశీ చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించడం, 2005లో వివాహం చేసుకోవడం జరిగిపోయాయి. 2004లోనే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె, మహేష్ మరియు పిల్లలే లోకంగా బ్రతికే మంచి గృహిణిగా మారిపోయారు. 

ఐతే మహేష్ వ్యవహారాలన్నీ చక్కబెట్టేది నమ్రతే అనేది టాక్. భార్య పాత్రతో పాటు, మహేష్ సినిమాలు, రెమ్యూనరేషన్స్, బ్రాండ్ ఎండోర్సెమెంట్స్  వంటి అన్ని విషయాలను చూసుకుంటారట. ఇక సోషల్ మీడియాలో తన పిల్లల క్యూట్ వీడియోస్ మరియు ఫోటోలు పంచుకుంటుంది. ఒకప్పటి మిస్ ఇండియా పెళ్లి తరువాత సాంప్రదాయ గృహిణిగా మారిపోయింది.