Asianet News TeluguAsianet News Telugu

గౌతమ్ స్టేట్ లెవెల్ లో టాప్ 8, మురిసిపోతున్న నమ్రత శిరోద్కర్!

మహేష్ కొడుకు గౌతమ్ 2018నుండి స్విమ్మింగ్ స్పోర్ట్స్ పై దృష్టి సారించాడట. సహజ సిద్ధంగా ఆ ఆట పట్ల మక్కువ పెంచుకున్న గౌతమ్ , హార్డ్ వర్క్ తో అందులో పరిణితి సాధించాడట. 

mahesh wife namrata feels proud of gautam as he achieves a milestone ksr
Author
Hyderabad, First Published Jun 17, 2021, 2:15 PM IST


కన్న బిడ్డలు ఏదైనా సాధిస్తే మురిసిపోవడం తల్లిదండ్రుల వంతు. మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ప్రస్తుతం ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొడుకు గౌతమ్ స్పోర్ట్స్ లో దూసుకుపోతుండగా ఆమె గర్వంగా ఫీల్ అవుతున్నారు. మహేష్ కొడుకు గౌతమ్ 2018నుండి స్విమ్మింగ్ స్పోర్ట్స్ పై దృష్టి సారించాడట. సహజ సిద్ధంగా ఆ ఆట పట్ల మక్కువ పెంచుకున్న గౌతమ్ , హార్డ్ వర్క్ తో అందులో పరిణితి సాధించాడట. 


తన ఏజ్ గ్రూప్ నుండి తెలంగాణా స్టేట్  టాప్ 8 స్విమ్మర్స్ లో గౌతమ్ ఉన్నాడని నమ్రతా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అలాగే గౌతమ్ స్విమ్ చేస్తున్న వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. గౌతమ్ స్విమ్మింగ్ లో వేగం, ఖచ్చితత్వంతో చాలా మెరుగ్గా ఉన్నాడని ఆమె చెబుతున్నారు. దీనితో ఎంచుకున్న స్పోర్ట్స్ లో గౌతమ్ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించే అవకాశం కలదు. 


టీనేజ్ లో ఉన్న గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి గౌతమ్ అభిరుచేమో వేరుగా ఉంది. ఒక వేళ తన అభిరుచి మేరకు స్విమ్మర్ గా, ఫ్యాన్స్ కోసం హీరోగా రెండు రంగాలలో గౌతమ్ రాణిస్తారేమో చూడాలి. ఇప్పటికే బాల నటుడిగా వన్ నేనొక్కడినే చిత్రంతో గౌతమ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios