మహేష్ బాబు తన పద్దతి మార్చుకున్నారు. కొద్దిగా కఠినంగా కనిపించినా కొన్ని రూల్స్ ని తనతో సినిమా చేసే దర్శకులకు అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు కారణం ఈ మధ్యకాలంలో వరస పెట్టి విన్న యంగ్ డైరక్టర్స్ కథలే అని తెలుస్తోంది.  మర్హర్షి చిత్రం తర్వాత చేయబోయే చిత్రం కోసం కథలు విన్నారు. ముఖ్యంగా కొత్త దర్శకులతో ఆయన మీట్ అయ్యారు. అయితే ఆ క్రమంలో ఆయనకు అర్దమైంది..వాళ్లంతా కేవలం స్టోరీలైన్స్ పట్టుకుని వస్తున్నారు కానీ ఒక్కరు కూడా పూర్తి బౌండెడ్ స్క్రిప్టు తో రావటం లేదు. బిగినింగ్ ఉంటోంది కానీ క్లైమాక్స్ చెప్పలేకపోతున్నారట. 

దాంతో స్టోరీ లైన్ గా   బాగున్నా ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి అది ఎలా తయారవుతుందో.. ఎలా ఉంటుందో తెలియకుండా తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేడు. వాళ్లేమో ...పాయింట్ ఓకే చేస్తే కథ రెడీ చేసి పట్టుకొస్తామంటున్నారు. అలా లైన్ ఓకే చేసి స్క్రిప్టు కోసం వెయిట్ చేసి, ఆ తర్వాత బాగోపోతే రిజెక్ట్ చేయాలి. ఇదంతా ఇబ్బందిగా, టైమ్ టేకింగ్ ప్రాసెస్ గా మహేష్ కు అనిపించింది. 

దాంతో తనను బౌండెడ్ స్క్రిప్టు తో కలిసే వాళ్ల కథనే వింటానని కండీషన్ పెడుతున్నారట. పెద్ద డైరక్టర్స్ కు కూడా మినహాయింపు లేదట. సుకుమార్ సైతం ఓ స్టోరీ లైన్ తో మహేష్ ని కలిస్తే నో చెప్పి...పూర్తి స్క్రిప్టుతో వచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాబట్టి మహేష్ ని కలిసే ముందు పూర్తి బౌండెడ్ స్క్రిప్టుతో వెళ్లటం మేలన్నమాట.