టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమాతో ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలకన్నా మహేష్ తన స్టైల్ తోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. హాలీవుడ్ హీరోలకు సైతం ఏ మాత్రం తక్కువ కానీ లుక్స్ తో మైమరపించే సూపర్ స్టార్ ఇప్పుడు సౌత్ లో ఓ రికార్డును అందుకున్నాడు. 

మహేష్ సినిమాల కన్నా ఇప్పుడు యాడ్స్ లలో ఎక్కువగా నటిస్తున్నాడు. ఆదాయాన్ని పెంచుకోవడంలో ఈ ఫ్యామిలీ హీరో ఎప్పుడు ముందుటాడు. ప్రస్తుతం మహేష్ 15 బ్రాండ్ లకు ప్రచారకర్తగా ఉన్నాడు. గోల్డ్ విన్నర్, అభిబస్, చెన్నై సిల్క్స్, క్లోజ్ అప్‌లతో పాటు థమ్స్ అప్ వంటి ప్రముఖ కంపెనీల యాడ్స్ లలో నటిస్తూ సౌత్ లోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

రీసెంట్ గా మల్టిప్లెక్స్ బిజినెస్ ను కూడా మహేష్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ అప్పుడపుడు ఫ్యామిలీ తో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ మహేష్ కెరీర్ ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇక ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.