భరత్ అనే నేను ప్రీరిలీజ్ కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్

First Published 31, Mar 2018, 11:10 AM IST
Mahesh to invite tarak and charan for bharath ane nenu pre release event
Highlights
భరత్ అనే నేను ప్రీరిలీజ్ కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం యొక్క ఆడియో వేడుక ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో జరగనున్న ఈ వేడుకకు వేల సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, తారక్ లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారట మహేష్.ః

అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన ఏమీ లేదు. మరి నిజంగానే మహేష్ వారిద్దరినీ వేడుకకు ఆహ్వానిస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు.

loader