సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలని ఎవరికి ఉండదు...అయితే వయస్సులో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు ఆ కోరిక ఉందంటే కామన్ అనిపిస్తుంది. కానీ 106 సంవత్సరాల బామ్మగారు కూడా మహేష్ తో సెల్ఫీ దిగాలని కోరిక కలిగి ఉన్నారంటే ఆ క్రేజ్ ఎలాంటిదో ఊహించవచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలని ఎవరికి ఉండదు...అయితే వయస్సులో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు ఆ కోరిక ఉందంటే కామన్ అనిపిస్తుంది. కానీ 106 సంవత్సరాల బామ్మగారు కూడా మహేష్ తో సెల్ఫీ దిగాలని కోరిక కలిగి ఉన్నారంటే ఆ క్రేజ్ ఎలాంటిదో ఊహించవచ్చు. ఇప్పుడదే మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యిపోయింది.
రాజమండ్రి కు చెందిన రేలంగి సత్యవతి అనే 106 సంవత్సరాల బామ్మగారికి మహేష్ అంటే అభిమానం. ఆవిడకు మహేష్ తో ఓ సెల్ఫీ దిగాలని ఎదురుచూస్తోంది. ఆ విషయం మీడియా ఛానెల్స్ కు చేరింది. అంతే వాళ్లు ఆ విషయాన్ని మహేష్ కు తెలియచేసే భాధ్యత వాళ్లు తీసుకున్నారు. మహేష్ కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఆ వయస్సులో ఆవిడ కోరిక తీర్చాలనుకోవటం మహేష్ కు ఆనందమే కదా.
కెరీర్ విషయానికి వస్తే...భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మహేష్ 25వ గా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహర్షి’టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.
అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ కనిపించనున్నారు. మహేశ్‌కు తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు.
