చరణ్ కాచుకో...మూడు రోజుల్లో రంగస్థలం రికార్డులు అవుట్

చరణ్ కాచుకో...మూడు రోజుల్లో రంగస్థలం రికార్డులు అవుట్

మహేష్ కు యూఎస్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఇక్కడ మహేష్ ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ కనక వర్షం కురిపిస్తాయి. నిన్నటి వరకు మహేష్ పేరిట నాన్ బాహుబలి రికార్డలు ఉండేవి. కానీ రంగస్థలం దెబ్బకి ఇప్పుడు అన్ని రికార్డలు ఆ సినిమాపై నే ఉన్నాయి. అక్కడ రంగస్థలం దాదాపు 3.5 మిలయర్ వరకు వసూళ్లు అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ రికార్డులు ఎక్కువ రోజులు ఉండేలా లేదు.యుఎస్ లో దాదాపు 400 లొకేషన్లలో ఏకంగా 2 వేల ప్రిమియర్ షోలు ప్లాన్ చేశారు ‘భరత్ అనే నేను’ సినిమాకు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు ప్రిమియర్లతోనే 1.5-2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఇక పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లో వసూళ్ల మోత మోగిపోతుంది. వారాంతం మొత్తంలో 10 వేల షోలు అంటున్నారంటే అవన్నీ ఫుల్స్ అయ్యాయంటే వసూళ్లు ఊహకందని విధంగా ఉంటాయి. వీకెండ్లోనే ‘రంగస్థలం’ రికార్డు ఈజీగా బద్దలైపోతుంది. ఫుల్ రన్లో 5 మిలియన్ డాలర్ల మార్కును కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలున్నాయి.  ‘భరత్ అనే నేను’తో మహేష్ మరోసారి రికార్డు విజయాన్నందిస్తాడన్న అంచనాలున్నాయి. చూద్దాం మరి ఈసారి ఏమవుతుందో?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos