కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ టీకా అందుబాటులోకి రావడం భారీ ఊరట లభించినట్లు అయ్యింది. అన్ని ప్రపంచ దేశాలు కరోనా వాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి.  కాగా తాను కరోనా టీకా వేయించుకున్నట్లు మాజీ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ తెలియజేశారు. కరోనా టీకా వేయించుకున్న చేతిని చూపిస్తూ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా టీకా వేయించుకోడం ద్వారా మరలా సాధారణ జీవితంలోకి వెళ్లవచ్చని ఆమె తెలియజేశారు. 

దుబాయ్ లో ఉంటున్న శిల్పా అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన కరోనా టీకా వేయించుకున్నారు. ఇక తనకు కరోనా టీకా అందించిన దుబాయ్ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కరోనా టీకా వేయించుకున్న మొదటి బాలీవుడ్ హీరోయిన్ గా శిల్పా శిరోద్కర్ నిలిచారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమతి నమ్రత శిరోద్కర్ స్వయానా అక్కనే ఈ శిల్పా శిరోద్కర్. 90లలో పలు హిందీ చిత్రాలలో శిల్పా శిరోద్కర్ నటించారు. మోహన్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మ మూవీలో శిల్పా శిరోద్కర్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ తరువాత తెలుగులో శిల్పా మూవీ చేయలేదు.