నిజమేనా?:మహేష్ బాబు ...గెడ్డం కథ
మహేష్ బాబు గెడ్డం పెంచి కనపడింది లేదు. ఆయన ముఖానికి గడ్డం నప్పదేమో అన్నంతగా ఎప్పుడూ నున్నటి షేవ్ తో ఉంటారు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు త్వరలో పెరిగిన గెడ్డంతో కనపడబోతున్నారు అని సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వార్తలు వస్తూంటే ఆశ్చర్యపోతున్నారు సినీ జనం. ఇంతకీ మహేష్ బాబు గెడ్డం కథేంది..అందులో నిజమెంత చూద్దాం.
మహేష్ బాబు గెడ్డం పెంచి కనపడింది లేదు. ఆయన ముఖానికి గడ్డం నప్పదేమో అన్నంతగా ఎప్పుడూ నున్నటి షేవ్ తో ఉంటారు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు త్వరలో పెరిగిన గెడ్డంతో కనపడబోతున్నారు అని సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వార్తలు వస్తూంటే ఆశ్చర్యపోతున్నారు సినీ జనం. ఇంతకీ మహేష్ బాబు గెడ్డం కథేంది..అందులో నిజమెంత చూద్దాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న రాజమౌళిల కాంబినేషన్ సిీనిమా చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి సమయంలోనే నెక్ట్స్ సినిమా మహేష్ బాబుతో చేయాలని జక్కన్న చెప్పాడు. కాని రకరకాల కారణాల వల్ల సినిమా పట్టాలు ఎక్కలేదు. జక్కన్న ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఖచ్చితంగా మహేష్ బాబుతో సినిమా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు మహేష్ బాబు రాజమౌళిల కాంబో మూవీ కోసం విజయేంద్ర ప్రసాద్ కథను తయారు చేసే పనిలో పడ్డారు అంటూ కూడా ప్రచారం మొదలైంది.
అయితే మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయాలి, జేమ్స్ బాండ్ తరహా ఫిల్మ్ చేయాలా అనేది జరుగుతున్న డిస్కషన్.అయితే మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా సినిమాను చేయాలని జక్కన్న భావిస్తున్నాడనేది న్యూస్. అందుకు తగ్గట్లుగానే విజయేంద్ర ప్రసాద్ శివాజీ కథపై రీసెర్చ్ చేసి మహేష్ ఇమేజ్ కు తగ్గట్లుగా కాస్త మార్పులు చేర్పులు చేయడంతో పాటు కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటన్నారు. ఆ నేపధ్యంలో మహేష్ బాబు గెడ్డం టాపిక్ వచ్చింది. శివాజీకి గెడ్డం ఉంటుంది కదా. అదే విధంగా మహేష్ బాబుకూడా ఈ సబ్జెక్టు చేయాలంటే గెడ్డం పెంచాలని చెప్పారట. అయితే అసలు మహేష్ ...శివాజీ పాత్ర వేస్తున్నారో లేదో తెలియదు. వేసినప్పుడు కదా గెడ్డం గొడవ అనేది రివర్స్ టాపిక్.
బాలీవుడ్ లో ఆ మధ్యన తానాజీ చిత్రం హిస్టారికల్ కాన్సెప్టుతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ కొలువులో సైన్యాధ్యక్షుడిగా పని చేసిన తానాజీ అనే వీరసైనికుడి వీరగాధతో ఈ సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించింది. దాంతో మనవాళ్లు ఏకంగా ఛత్రపతి శివాజీ అజేయమైన వారియర్ స్టోరీతో ఎస్.ఎస్.రాజమౌళి సినిమా తెరకెక్కించనున్నారని వార్తలు మొదలెట్టారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఆ స్దాయి సినిమా తీయడమే కరెక్ట్ అనేది మాత్రం నిజం.