మహేష్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ వింత అనుభవం ఎదురైంది. షూటింగ్ స్పాట్ లో మ‌హేష్ ని క‌ల‌వాల‌ని హ‌ల్ చ‌ల్ చేసిన యువ‌తి. సెక్కురిటితో గొడ‌వ‌ప‌డి మ‌రి మ‌హేష్ ని క‌లిసిన అమ్మాయి. యువ‌తి అభిమానానికి పొంగిపోయి సెల్ఫీ తీసుకునే అవకాశం ఇచ్చిన హిరో

మహేష్‌పై ఓ బైక్ ఛేజింగ్ సీన్‌ను తెరకెక్కించారు. ఈ సీన్ అయిపోగానే సెట్ నుంచి మహేష్ తన కార్వాన్‌లోకి వెళుతుండగా ఓ అమ్మాయి షూటింగ్ చూస్తున్న జనంలో నుంచి హడావుడిగా మహేష్‌ను కలిసేందుకు ప్రయత్నించింది. సెక్యురిటీ ఆపినా ఆగలేదు. మహేశ్ కూడా ఆ యువతి అభిమానానికి పొంగిపోయాడు. సెల్ఫీ తీసుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో ఆ యువతి ఆనందానికి అవధులు లేవు. ఇలాంటి సంఘటనలు సినిమా షూటింగ్‌ల్లో అప్పుడప్పుడు హీరోలకు, హీరోయిన్లకు ఎదురవుతూనే ఉంటాయి.