సూపర్ స్టార్ మహేష్ కొడుకు గౌతమ్ ఎదుగుదలకు మురిసిపోతున్నారు.నేడు గౌతమ్ పుట్టినరోజు కావడంతో మహేష్ ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. గౌతమ్ పొత్తిళ్లలో ఉన్న ఫొటోతో పాటు, యువకుడిగా తనతో సరదాగా గడుపుతున్న గౌతమ్ ఫోటోలను మహేష్ పంచుకున్నారు. అలాగే ఓ ఎమోషన్ నోట్ కూడా దానికి జోడించడం జరిగింది. మహేష్ తన ట్వీట్ లో '' హ్యాపీ 14 మై సన్, డొరొమేన్ నుండి అపెక్స్ లెజెండ్స్ వరకు నీవు ఒక పర్ఫెక్ట్ యువకుడిగా ఎదిగిన తీరుకు గర్వంగా ఉంది. నీతో పాటు ఈ జర్నీ చాలా ఆనందకరం. పుట్టినరోజు శుభాకాంక్షలు...ఐ లవ్ యూ..'' అని పొందుపరిచారు. 

మహేష్ తన ట్వీట్ లో కొడుకు గౌతమ్ పట్ల తనకున్న అపరిమితమైన ప్రేమను బయటపెట్టడం జరిగింది. ఇక గౌతమ్ 14వ బర్త్ డేను మహేష్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గౌతమ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ మురిసిపోతున్నారు. కాగా గౌతమ్ బాల నటుడిగా ఇప్పటికే ఓ చిత్రంలో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో 2014లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ నేనొక్కడినే చిత్రంలో గౌతమ్ నటించడం జరిగింది. 

ఆ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్రను గౌతమ్ చేశారు. కాగా మరో వైపు మహేష్ తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ ఓ భిన్నమైన రోల్ ట్రై చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.