మహేష్‌బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రం దుబాయ్‌లోని `ఇన్‌5దుబాయ్‌` అనే బిజినెస్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ఆ లొకేషన్‌ ఫోటోలను పంచుకున్నారు మహేష్. అద్భుతమైన అనుభవంలా ఉందన్నారు.

మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట` దుబాయ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దుబాయ్‌లోని `ఇన్‌5దుబాయ్‌` అనే బిజినెస్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది.

ఆ లొకేషన్‌ ఫోటోలను పంచుకున్నారు మహేష్. అద్భుతమైన అనుభవంలా ఉందన్నారు. `సర్కారువారి పాట` షూటింగ్‌ `ఇన్‌5దుబాయ్‌`లో అమేజింగ్‌ ఎక్స్ పీరియెన్స్. వారి ఆలోచనలను రియాలిటీగా మార్చడం ద్వారా ఔత్సామిక పారిశ్రామిక వేత్తలకు, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా, వారికి కావాల్సిన విధంగా ఇది రూపుదిద్దుకుంది. ఆత్మీయ స్వాగతానికి అభినందిస్తున్నా. గుడ్‌ లక్‌` అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ `ఇన్‌5దుబాయ్‌` బిల్డింగ్‌ని, అందులోని లోపల భాగాన్ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరోవైపు సెట్‌లో మహేష్‌కి పరశురామ్‌ గొడుగు పట్టుకున్నట్టు ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. 

View post on Instagram

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ సెట్‌కి వెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌.. మహేష్‌ బ్యాక్ సైడ్‌ నుంచి క్లోజ్‌లో తీసిన ఓ ఫోటోని పంచుకున్నారు. మహేష్‌ లుక్‌ రివీల్‌ కాకుండా తీసిన ఆ ఫోటో సైతం వైరల్‌ అయ్యింది. ఇక దాదాపు 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతుందని, అనంతరం హైదరాబాద్‌కి వచ్చి, ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరిస్తారని సమాచారం.