త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరిమధ్య గ్యాప్ పెరిగిపోవడంతో ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడిపోయింది. హారిక హాసిని నిర్మాణ సంస్థ మహేష్ కి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడంతో మహేష్ హర్ట్ అయ్యాడని, త్రివిక్రమ్ తో సిఎంమ ఉందని వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్ కూడా మహేష్ సంగతి పక్కన పెట్టేశాడు.

ఒప్పందం ప్రకారం మహేష్ తో చేయాల్సిన యాడ్ ఫిలిమ్స్ షూట్ చేసి సైలెంట్ అయిపోయాడు. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి మహేష్ తో కలిసి ఓ ప్రకటన రూపొందించారు. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ యాడ్ కి సంబంధించిన నిర్వాహకులు ముందుగా మహేష్ ని  సంప్రదించినప్పుడు డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ చేసుకోలేదట.

కానీ మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్ పేరు సూచించడంతో వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు భార్య నమ్రత.. త్రివిక్రమ్ కి ఫోన్ చేసిన ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో బడా డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారు కూడా ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మహేష్ 'మహర్షి'  రిలీజ్ తరువాత అనీల్ రావిపూడితో సినిమా చేస్తాడు.

ఆ తరువాత ఎవరితో చేయాలనే విషయంలో మహేష్ కి క్లారిటీ లేదు. సుకుమార్ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు.. సందీప్ వంగా కూడా డౌటే.. ఈ క్రమంలో త్రివిక్రమ్ ని పక్కన పెట్టడం సరికాదని మహేష్ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు.