నెలన్నర పాటు గ్యాప్ లేకుండా ప్లాన్..కానీ అదే అడ్డం


వాస్తవానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కు సమస్యలు ఎదురయ్యయని తెలుస్తోంది.
యూఎస్ వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాలు కోసం దరఖాస్తులు చేయగా వారి దరఖాస్తులు ఇంకా ప్రోసెస్ చేయబడలేదని తెలుస్తోంది. వీసాలు ఆలస్యం కారణంగా
షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. 

Mahesh Sarkaru Vaari Paata Schedule Plans Jsp


ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు. దాంతో తన తదుపరి చిత్రంగా పరశురామ్‌తో   ‘సర్కారు వారి పాట’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రకరకాల కారణాలతో ఈ విషయమై క్లారిటీ రావటం లేదు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభం కానుంది. పరుశరామ్, అతని టీమ్ ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసి, వెనక్కి తిరిగి వచ్చారు. 

వాస్తవానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కు సమస్యలు ఎదురయ్యయని తెలుస్తోంది. యూఎస్ వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాలు కోసం దరఖాస్తులు చేయగా వారి దరఖాస్తులు ఇంకా ప్రోసెస్ చేయబడలేదని తెలుస్తోంది. వీసాలు ఆలస్యం కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి అవి వచ్చినట్టయితే ఆ తక్కువ మందితోనే అక్కడికి వెళ్లి షూట్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట.45రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. 
  
 మరో ప్రక్క ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే.. డిజిట‌ల్ రైట్స్, నాన్- థియరేటిక‌ల్ రైట్స్ ను అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 35కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ను కూడా అమ్మేయ‌బోతున్నారు. అది కూడా భారీ రేటుకే అని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios