మహేశ్ బాబు కీర్తి సురేశ్ జంటగా నటించిన సినిమా సర్కారువారి పాట. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. అప్ డేట్స్ లో రచ్చ రచ్చ చేస్తుందీ మూవీ. రీసెంట్ గా ఈమూవీ సాంగ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మహేశ్ బాబు కీర్తి సురేశ్ జంటగా నటించిన సినిమా సర్కారువారి పాట. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. అప్ డేట్స్ లో రచ్చ రచ్చ చేస్తుందీ మూవీ. రీసెంట్ గా ఈమూవీ సాంగ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది సర్కారువారి పాట సినిమా. ఈ సినిమాలో మహేశ్ బాబు కంప్లీట్ గా యంగ్ లుక్ లో .. డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాకుండా..కి రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రను చేయబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన టైటిల్ సాంగ్ ..'కళావతి' సాంగ్ , పెన్నీ సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'మ మ మహేశా' సాంగును రిలీజ్ చేయగా ఒక కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసేలా దూసుకుపోతోంది.

రెండు రోజుల్లోనే ఈ పాట 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను కలర్ ఫుల్ గా షూట్ చేశారు. అంతే కాదు మహేష్ ఇంతకు ముందులా కాకుండా ఊర మాస్ స్టెప్పులతో అలరించాడు. సైలెంట్ గా కనిపించే కీర్తి సురేష్ కూడా ఈ పాటలో మాస్ స్టెప్పులతో ఇదరగదీసింది.
ఇక మే 12న రిలీజ్ కాబోతున్న ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్. ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు.
