`సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మహేష్‌. ఇందులోనుంచి ఓ పాటని తీశారట. షూటింగ్‌ చేసి, అంతా కంప్లీట్‌ అయ్యాక ఆ పాటని తీసేసినట్టు చెప్పారు. 

మహేష్‌బాబు(Maheshbabu) నుంచి రెండేళ్ల తర్వాత వస్తోన్న సినిమా `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata). ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మహేష్‌బాబు ఇందులో చెప్పిన డైలాగులు బోల్డ్‌గా ఉండటంతో రీచ్‌ ఎక్కువగా ఉంది. అంతేకాదు ఆయన బాడీ లాంగ్వేజ్‌ కూడా చాలా ఫ్రీగా ఉంది. నటుడిగా చాలా ఓపెన్‌ అయ్యారు. `పోకిరి` తరహాలో ఉంటుందని స్వయంగా మహేష్‌బాబునే తెలిపారు. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మహేష్‌. ఇందులోనుంచి ఓ పాటని తీశారట. షూటింగ్‌ చేసి, అంతా కంప్లీట్‌ అయ్యాక ఆ పాటని తీసేసినట్టు చెప్పారు సూపర్‌స్టార్‌. అయితే ఆ పాతని ఎందుకు తీసేయాల్సిందో వివరించారు. `సర్కారు వారి పాట` చిత్రంలో అన్ని మంచి పాటలు కుదిరాయి. `కళావతి`, `పెన్నీ` సాంగ్‌లు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో తెలిసిందే. వంద మిలియన్స్ వ్యూస్‌ని దాటాయి. ఇటీవల `మ మ మహేషా` (Ma Ma Mahesha)సాంగ్‌ దుమ్మురేపుతుంది. ఊరమాస్‌ బీట్‌ని పోలిన ఈ పాట మరింత హైలైట్‌ అవుతుంది. 

అయితే ముందుగా ఈ పాట సినిమాలో లేదట. చివర్లో యాడ్‌ చేసినట్టు చెప్పారు. అన్నీ మెలోడీగా, కూల్‌గా ఉండే సాంగ్స్ ఉన్నాయని, మాస్‌ బీట్‌ ఒక్కటి కూడా లేదనే ఫీలింగ్‌ సినిమా చూసుకున్నాక అనిపించిందట. ముందుగా `మురారీ` అంటూ ఓ పాటని కంపోజ్‌ చేయడం, షూట్‌ చేయడం కూడా అయిపోయిందని, కానీ చివర్లో ఆ పాట సెట్‌కావడం లేదట. ఆ స్థానంలో ఏదైనా మాస్‌ బీట్‌, ఊపున్న సాంగ్‌ అయితే బాగుంటుందనిపించిందట. ఆ విషయాన్ని మహేష్‌ దర్శకుడి, సంగీత దర్శకుడు థమన్‌కి చెప్పాడు. దీంతో అప్పటికప్పుడు `మ మ మహేషా` సాంగ్‌ ట్యూన్‌ని కంపోజ్‌ చేశాడట థమన్‌. 

అప్పటికప్పుడు `మమ మహేష్` కంపోజ్ చేసి స్పెషల్ గా ఓ భారీ సెట్ ని వేసి షూట్ చేయడం జరిగిందన్నారు. పాట వండర్ ఫుల్ గా వచ్చింది. థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పారు మహేష్‌. `మురారి` పాట సినిమాలో ఉండదని, దాన్ని డైరెక్ట్ గా యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తామని చెప్పారు మహేష్‌. `కళావతి` సాంగ్‌ గురించి చెబుతూ, `కళావతీ సాంగ్‌ చాలా పెద్ద హిట్టయ్యింది. నాకు బాగా నచ్చిన పాట. అయితే తమన్‌ ట్యూన్‌ వినిపించగానే నాకు పెద్దగా అనిపించలేదు. నాపై ఇలాంటి పాట వర్కవుట్‌ అవుతుందా అనే అనుమానం వచ్చింది. కానీ తమన్‌ పట్టుపట్టాడు. `నన్ను నమ్మండి.. మీ కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్‌ అవుతుంది. పెళ్లిళ్లలో ఇదే పాట వినిపిస్తుంది` అన్నాడు. తన మాటే నిజమైంద`ని చెప్పారు.