స్విట్జర్లాండ్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, మహేష్ బాబు ఇద్దరూ కలిసి సరదాగా దిగిన ఫోటోను సోషల్ సైట్స్ లో పోస్ట్ చేసిన స్టార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మహేష్, చరణ్ ల ఫోటో
ముఖ్యంగా పెద్దింటి కుటుంబాలకు చెందిన హీరోలు అంత ఫ్రెండ్లీగా ఉండరని ఊహించుకుంటారు. అయితే ఆ ఊహ నిజం కాదని కొన్ని సంఘటనలు చెబుతుంటాయ్. తాజాగా, ఓ ఫొటో ఆ విషయాన్ని మరింత బలంగా చూపించింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ చిరునవ్వులు చిందిస్తూ, దిగిన ఈ ఫొటో ఇక్కడిది కాదు. భార్యాపిల్లలతో కలసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మహేశ్ విదేశాలు వెళ్లారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఉన్నారు. రామ్‌చరణ్ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఇండియన్ స్టార్స్ అక్కడ సందడి చేశారు. ఫొటో దిగి, ‘బియాండ్ బౌండరీస్... హ్యాపీ హాలీడేస్’ అని మహేశ్, చరణ్ సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్కడైనా స్టార్ కాని ఫ్రెండ్‌షిప్ విషయంలో స్టార్ కాదన్నట్లుగా మహేశ్ – చరణ్ చెబుతున్నట్లుంది కదూ. అనుకోకుండా కలిసినా స్టార్ స్టేటస్‌ని పక్కన పెట్టి, ఇలా కాసేపు ఫ్రెండ్లీగా హాలిడేస్‌ని ఎంజాయ్ చేయడం స్నేహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.
