సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్టార్ డైరక్టర్ ని హోల్డ్ లో పెడతారని ఊహించగలమా...కథ నచ్చలేదు వేరే కథ చేసుకురమ్మని చెప్తాడని అనుకుంటామా..కానీ అదే జరిగిందిట. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినపడుతున్న సమాచారం ప్రకారం...మహేష్ బాబు, సుకుమార్ దర్శకత్వంలో మొదలవ్వాల్సిన సినిమా వాయిదా పడిందిట. అలాగని సుకుమార్ వేరే హీరోని ఎప్రోచ్ అవటానికి లేదట. సుకుమార్ చెప్పిన కథని మార్చమని, వేరే కథ చెయ్యమని అడిగిన మహేష్..మరో కథ చేసుకుని వచ్చినా నో చెప్పేసాడట. అయితే మనం ఖచ్చితంగా సినిమా చేస్తున్నాం అని చెప్పారట.దాంతో సుకుమార్ వేరే దారిలేక మరో కథను రెడీ చేస్తున్నారట. 

ఇంతకు ముందు సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 1, నేనొక్కిడినే చిత్రం డిజాస్టర్ కావటంతో ...ఈ సారి మళ్లీ అలాంటి సమస్య తలెత్తకూడదని మహేష్ భావిస్తున్నాడట. అలాగని రొటీన్ మసాలా సినిమా చేయనని, కొత్త సబ్జెక్టుతోనే ముందుకు వెళ్దామని అన్నారట. అదే పద్దతిలో రెండు స్క్రిప్టులు చేస్తే రెండు రిజెక్ట్ చేసి, బెస్ట్ అవుట్ ఫుట్ కావాలని అన్నారట. రంగస్దలం వంటి సూపర్ హిట్ ఇచ్చాక కూడా సుకుమార్ పరిస్దితి ఇలా ఉండటం ఆశ్చర్యమే అంటున్నారు. 

ఇక మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న  "మ‌హ‌ర్షి" ఫిబ్ర‌వ‌రి నాటికి పూర్త‌వుతుంది. ఆ లోపు మ‌హేష్ కోసం సుకుమార్ క‌థ సిద్ధం చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ విషయంగా మారింది. అదే స‌మ‌యంలో మ‌హేష్ బాబుతో  క‌మిట్మెంట్ ఉన్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఇప్పుడు "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ ని పూర్తి చేసుకుని మహేష్ తో చేయటానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఇప్పుడు "మ‌హ‌ర్షి" త‌ర్వాత మ‌హేష్ ఏం చేస్తాడు.. చేయ‌బోతున్నాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సుకుమార్ కు ఇదో కొత్త టెన్షన్ అయ్యింది.