మన్మథుడు అక్కినేని నాగార్జున బర్త్ డే సందడి షురూ అయ్యింది. ఆయన పుట్టిన రోజు రేపు(శనివారం) అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సాయంత్రం హ్యాపీ బర్త్ డే కింగ్‌ నాగార్జున యాష్‌ ట్యాగ్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగ్‌ స్పోర్ట్స్ బైక్‌పై బ్యాక్‌ కి తిరిగి తుపాకి ఎక్కుపెట్టి సీరియస్‌గా, స్టయిలీష్‌గా ఉన్న నాగ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉంటే ఇటీవల హ్యాపీ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లు ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్‌బాబు బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఆరు కోట్ల ట్వీట్లలో వరల్డ్ రికార్డ్ సృష్టించగా, దాన్ని మించేలా పవన్‌ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ తో రికార్డ్ సృష్టించారు. ఏకంగా ఆరున్నర కోట్ల మంది ట్వీట్‌ చేసి ప్రపంచ రికార్డ్ ని సృష్టించారు. 

అయితే ఇప్పుడు నాగ్‌ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు హ్యాపీ బర్త్ డే కింగ్‌ నాగార్జున యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేయిస్తున్నారు. దీంతో మహేష్‌, పవన్‌ అభిమానులకు గుబులు పట్టుకుంది. తమ అభిమాన హీరోలకు ఎక్కడ మించిపోతాడేమో అని ఆందోళన చెందుతున్నారని టాక్‌. అయితే సీరియర్‌ హీరోలకు సోషల్‌ అంతగా పోటీ ఉండదు. వాళ్ళకి ఫాలోయింగ్‌ కూడా తక్కువే. కాబట్టి ఈ విషయంలో పెద్దగా టెన్షన్‌ పడాల్సిన అవసరం మహేష్‌, పవన్‌ అభిమానులకు లేదని అంటున్నారు.