రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ డైరక్టర్ వెళ్లి కథ చెప్పినా ఒప్పుకునేలా లేడు. ఎందుకంటే వరుసగా మూడు సినిమాలతో ఈ యంగ్ హీరో బిజిగా ఉన్నాడు. డియర్ కామ్రేడ్ షూటింగ్ పనులన్నీ అయిపోయినప్పటికీ ప్రమోషన్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు మిగిలున్నాయి. బ్రేకప్ - హీరో అనే మరో రెండు సినిమాల షూటింగ్ లలో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. 

అయితే ఇప్పుడు ఎంత మంచి స్టోరీ వచ్చినా వచ్చే ఏడాది ఎండింగ్ వరకు మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండేళ్ల వరకు డేట్స్ ఫుల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విజయ్ కి మహేష్ నుంచి వచ్చిన ఒక అఫర్ కలవరపెడుతోంది. ప్రస్తుతం తన GMB ప్రొడక్షన్ లో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తోన్న మహేష్ అడివి శేష్ తో మేజర్ అనే మరో సినిమాను నిర్మిస్తున్నాడు. 

ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమాను నిర్మించడానికి సూపర్ స్టార్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిజీగా ఉన్నప్పటికీ విజయ్ మహేష్ అఫర్ కి నో చెప్పలేకపోతున్నాడట. షెడ్యూల్స్ ని కొంచెం చేంజ్ చేసి మహేష్ హోమ్ ప్రొడక్షన్ లో విజయ్ వర్క్ చేయాలనీ అనుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో విజయ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.