టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా ఇతర బిజినెస్ ల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సౌత్ లో టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీతో చేతులు కలిపాడు. 

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుక్ ప్రచారకర్తగా ఉన్నా డెన్వర్ డియో'స్ కి ఇప్పుడు సౌత్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ డీల్ సెట్ చేసుకున్నాడు. ఈ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాక మహేష్ ఆదాయం కూడా గట్టిగా పెరగనున్నట్లు టాక్ వస్తోంది. 15కి పైగా కంపెనీలతో ఇప్పటికే మహేష్ ప్రచార కర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 

డెన్వర్ డియో'స్ యాడ్ కోసం త్వరలోనే మహేష్ ముంబయ్ కు పయనం కానున్నాడు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.