భరత్ అనే నేను సినిమా అందరికి నచ్చేలా ఉంటుందని సూపర్ స్టార్ మహేష్ ముందు నుంచి చెబుతూనే వస్తున్నాడు. ఫైనల్ గా సినిమా రిలీజ్ రోజు మొదటి ఆటకే అది నిజమైంది. సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకోవడమే కాకుండా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీమంతుడు కాంబినేషన్ అనుకున్న స్థాయిలో అంచనాలకు తగ్గట్టుగా కనిపించడంతో అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ అదిరింది.

ఇకపోతే మహేష్ తన సినిమా హిట్ అయితే ఎంత సంతోషంగా ఉంటాడో అందరికి తెలిసిందే. సరైన హిట్ కోసం చూస్తున్న సమయంలో భరత్ అనే నేను మంచి కిక్ ఇచ్చింది. దీంతో మహేష్ ప్రస్తుతం ఆ విజయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో మహేష్ ఈ విజయాన్ని చాలా బాగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా మహేష్ తన సతీమణి నమ్రత ముద్దు పెడుతూ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థాంక్యూ మై లవ్ అని మహేష్ ఫొటోను పోస్ట్ చేశాడు. ప్రేమతో రొమాంటిక్ గా ఉన్న ఆ ఫోటోను చూసి అభిమానులు ఎవరికీ నచ్చినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.