ప్రపంచంవ్యాప్తంగ యనలేని గుర్తింపు తెచ్చుకున్నషో బిగ్ బాస్ . భాషాభేదం, ప్రాంతభేదం లుకుండా అన్ని భాషల్లోను దూసుకుపోతోంది. షో నిర్వాహకులు కూడా స్థానిక లాంగ్వేజ్ కి తగ్గట్టు హోస్ట్ లను నియమిస్తూ మంచి రేటింగ్ అందుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి షోలో వ్యాఖ్యాత ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షోను మొత్తం నడిపించాలి కాబట్టి టాలెంట్ ఉన్న నటులనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. 

తెలుగులో మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కమల్ హాసన్ పరవాలేదు అనిపించాడు. ఇకపోతే మరాఠీ లో కూడా బిగ్ బాస్ రానుంది. అక్కడ హోస్ట్ గా ఉండేది ఎవరో తెలుసా?. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా అందరిని ఆకట్టుకున్న మహేష్ మంజ్రేకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఈ టాలెంటెడ్ నటుడు తెలుగు ఆడియెన్స్ కి బాగా తెలుసు. ఒక్కడున్నాడు - అఖిల్ - డాన్ శీను వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే మహారాష్ర్ట లో మహేష్ కు మంచి క్రేజ్ ఉంది. దీంతో అయనతోనే బిగ్ బాస్ ను నడిపించాలని డిసైడ్ అయ్యారు నిర్వాహకులు. ఏప్రిల్ 15 నుంచి మరాఠీ లో ఈ షో మొదలు కానుంది. మరాఠీలకు తప్పకుండా ఈ షో నచ్చునుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ షోకి సంబంధించిన ప్రమోషన్స్ ఉపందుకున్నాయి. మరాఠి లో ఈ షో ఏ మేరకు రంజింపచేస్తుందో వేచిచూడాలి.