కత్తి మహేష్ కి నచ్చిన రంగస్థలం... ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ

First Published 30, Mar 2018, 5:00 PM IST
Mahesh kathi positive reports for rangasthalam
Highlights
కత్తి మహేష్ కి నచ్చిన రంగస్థలం... ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ

వేసవి కానుకగా విడుదలైన రంగస్థలం మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ విడుదలైన తెలుగు చిత్రాల్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ.. ఈ సినిమాకు ప్రధాన బలం. 1980ల నాటి గోదావరి పల్లెటూరు అందాలను మరోసారి తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందుంచారు. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది.

‘రంగస్థలం’ సినిమా గురించి మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా స్పందించాడు. ఓల్డ్ బాటిల్‌లోని ఓల్డ్ వైన్‌‌తో మూవీని పోల్చాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు గుప్పించాడు. అనవసరంగా సాగదీసినప్పటికీ.. సినిమాలోని నటీనటులంతా చక్కగా నటించడంతో.. భరించొచ్చంటూ చూడొచ్చంటూ ట్వీట్ చేశాడు.

 సినిమా గురించి కత్తి మహేష్ రివ్యూ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. ఎక్కడా హీరో రామ్ చరణ్ పేరుగానీ, డైరెక్టర్ సుకుమార్ పేరు గానీ ప్రస్తావించలేదు. ఇక్కడే మెగా అభిమానులకు కోపం వచ్చింది. మిగతా సినిమాల్లో హీరో నటన బాగుంది.. కేక.. అబ్బో అంటూ పొగడ్తలు గుప్పిస్తావ్.. మరి మెగా హీరో పేరెత్తలేదెందుకు.. నువ్వు.. నీ రివ్యూలు అంటూ.. తిట్టి పోస్తున్నారు.

కత్తి రివ్యూ సినిమా గురించి పాజిటివ్‌గానే ఉండటం, సినిమా అద్భుతంగా ఉండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లోనూ రంగస్థలం చక్కటి ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో ఇప్పుడు వాళ్ల ధ్యాసంతా సినిమాను ఎంజాయ్ చేయడం, ఈ వీకెండ్లో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అంచనాలు వేయడం పైనే.

 

                                        https://twitter.com/kathimahesh/status/979598480757874693

loader