Asianet News TeluguAsianet News Telugu

సర్కారు వారి పాట సెట్స్ లో జాయిన్ అయిన మహేష్, లేటెస్ట్ లుక్ లీక్

 సర్కారు వారి పాట షూట్ కి వచ్చిన మహేష్ లుక్ బయటికి వచ్చింది. ఆడిడాస్ క్యాప్, చెక్ షర్ట్ ధరించిన మహేష్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. 

mahesh joins in sarkaru vaari paata sets and his latest look goes viral ksr
Author
Hyderabad, First Published Jul 31, 2021, 8:37 AM IST

మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, మహేష్ పాల్గొంటున్నారు. సర్కారు వారి పాట షూట్ కి వచ్చిన మహేష్ లుక్ బయటికి వచ్చింది. ఆడిడాస్ క్యాప్, చెక్ షర్ట్ ధరించిన మహేష్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. బయటికి వచ్చిన మహేష్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఫ్యాన్స్ మహేష్ కొత్త ఫోటోలను వైరల్ చేస్తున్నారు. 


ఇక దర్శకుడు పరుశురామ్ ఓ భిన్నమైన కథాంశంతో సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలు, ఆర్థిక నేరాలు ప్రధానంగా ఈ మూవీ సాగుతుందనే ప్రచారం ఉంది. మహేష్ రెండు భిన్నమైన షేడ్స్ లో ఈ చిత్రంలో కనిపించనున్నారని సమాచారం. సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం కాగా, లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. 


ఇక మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మహేష్ తో మొదటిసారి జతకడుతుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక నేడు సర్కారు వారి పాట నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది.  ఆగష్టు 9న మహేష్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మొదలైపోయాయి. ఇక సర్కారు వారి పాట సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios