టాలీవుడ్ లో  మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2 సినిమాల సక్సెస్‌తో ఏకంగా సూపర్‌ స్టార్ మ‌హేష్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముందుగా మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంద‌రు అనుకున్నప్పటికి, చివ‌రికి బాల్ అనీల్ రావిపూడి కోర్టులోకి వ‌చ్చి ప‌డింది. మ‌హర్షి సినిమా రిలీజ్ త‌ర్వాత ఈ  చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో మహేష్ పాత్ర పేరు అజయ్ జోసఫ్.  అలాగే సినిమా టైటిల్ ..సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారక్టరైజేషన్ హైలెట్ కానుంది. 

ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించనున్నారు. అనిల్-మహేశ్ ప్రాజెక్టులో జగ్గూభాయ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. శ్రీమంతుడు చిత్రంలో మహేశ్‌కు తండ్రిగా నటించాడు జగపతిబాబు. మహర్షి సినిమా విడుదల తర్వాత ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌హేష్ 26వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి అనీల్ సుంక‌ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ర‌ష్మిక మంథాన‌, అదితి రావు హైద‌రి చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 2020లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు.