టాలీవుడ్ భామ‌లు బిజీకొర‌టాల ప్రాజెక్ట్‌లో ముంబై బ్యూటీ ?డిమాండ్స్ తో చుక్క‌లు చూపిస్తోన్న భామ‌

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని కొరటాల శివ ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం మహేష్‌ బాబు నటిస్తున్న మురుగదాస్ చిత్రం త్వరలోనే షూటింగ్ ని పూర్తి చేసుకోనుంది. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. 

ఇక ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ బ్యూటీ ‘ఎం ఎస్ ధోని’ సినిమాలో నటించింది . ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో మహేష్‌ బాబుకి కొత్త హీరోయిన్ కంపల్సరీ అయింది.

అయితే కైరా అద్వానీ...మహేష్‌ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ చెప్పినప్పటికీ...ఓ కండిషన్ ని పెట్టిందట.తనకి 70 లక్షల రెమ్యునరేషన్ తో పాటు ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ని ఇవ్వాలని కోరిందట. కైరా అద్వానీ అడిగిన స్పెషల్ ఫెసిలిటీస్ ని చూస్తే...వాటి ఖర్చు దాదపు 40 లక్షల అవుతుంది. . దీంతో డైరెక్టర్ కైరా అద్వానీ ని తీసుకోవాలా?వద్దా? అనే ఆలోచనలో ఉన్నారని చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.