మహేష్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గతంలో దూకుడు వంటి సూపర్ హిట్, ఆగడు, 1 నేనొక్కిడినే  వంటి డిజాస్టర్ చిత్రాలు  వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ బ్యానర్ లో మహేష్ సినిమా చెయ్యలేదు. అయితే మళ్లీ ఇంత కాలానికి ఆ బ్యానర్ కు మహేష్ సినిమా చేయటానికి కమిటైనట్లు సమాచారం.  దర్శకుడు మరెవరో కాదు అనీల్ రావిపూడి. అనీల్ రావిపూడి గతంలో ఆగడు సినిమాకు పనిచేసారు. ఆ పరిచయంతో ఈ డైరక్టర్ ని లాక్ చేసారు నిర్మాతలు. 

మహేష్ తోనూ 14 రీల్స్ కు సినిమా ఎప్పుడో చెయ్యాల్సి ఉంది. సరైన ప్రాజెక్టుతో హిట్ కొడదామని ఇన్నాళ్లు వెయిట్ చేసారు. మళ్లీ ఇన్నాళ్లకు టైమ్ వచ్చిందని భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. అనీల్ సుంకర ఈ మేరకు మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసాడని చెప్తున్నారు. 

ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఎఫ్2 సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు.  పూర్తి స్థాయిలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వందకోట్లకు పైగా కలెక్ట్ చేసింది.   దాంతో ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ ప్రిన్స్ కి కథ చెప్పారు.  అనిల్ కథ మహేష్ కు బాగా నచ్చిందని, పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారని వార్తలు తెలుస్తోంది.