తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌నిచ్చారు సూపర్ స్టార్ మహేష్‌బాబు. త్రివిక్రమ్‌తో కథా చర్చలు జరిగినట్టు చెప్పారు. ప్రస్తుతం దుబాయ్‌లో మహేష్ ఎంజాయ్ చేస్తున్నారు.
మహేష్‌బాబు గత ఆర్నెళ్లుగా తన కొత్త సినిమా అప్‌డేట్ నాన్చుతూ వస్తున్నారు. చాలా గ్యాప్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి ఆర్నెళ్లకిపైనే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమవుతుందనే టాక్ వినిపించింది. కానీ అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌నిచ్చారు సూపర్ స్టార్ మహేష్‌బాబు. త్రివిక్రమ్‌తో కథా చర్చలు జరిగినట్టు చెప్పారు. ప్రస్తుతం దుబాయ్‌లో మహేష్ ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన పిక్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వెకేషన్‌లోనే త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌థమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీలను కలుసుకున్నారు. వీరంతా `ఎస్‌ఎస్‌ఎంబీ28` సినిమా గురించి చర్చించినట్టు తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తెలిపారు.
ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. `వర్క్ అండ్ చిల్.. దుబాయ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, థమన్‌లతో ప్రొడక్టీవ్ ఆఫ్టర్ నూన్` అని పేర్కొంటూ వీరంతా కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు మహేష్. దీంతో అభిమానులు ఖుషీ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ కానుందని తెలుస్తుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌బాబు.. `సర్కారువారి పాట`లో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. కీర్తిసురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌లో ఇప్పటికే `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చాయి. `అతడు` చిత్రం ఎంత పెద్ద విజయమో తెలిసిందే. ఈ చిత్రం టీవీలో రికార్డ్ టీఆర్పీ పొందడం విశేషం. అంతేకాదు రికార్డ్ స్థాయిలో టెలికాస్ట్ అయ్యింది. అయితే ఆ తర్వాత చేసిన `ఖలేజా` చిత్రం పరాజయం చెందింది. త్రివిక్రమ్‌నుంచి వచ్చిన ఓ డిఫరెంట్ చిత్రమిది. ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇన్నాళ్లకి ఇప్పుడు మరో సినిమారాబోతుంది. చివరిగా త్రివిక్రమ్ `అల వైకుంఠపురములో` చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. మరోవైపు `భీమ్లానాయక్` చిత్రానికి మాటలు, కథనం అందిస్తున్నారు.
