సమంతని నిలదీస్తోన్న మహేష్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Sep 2018, 4:44 PM IST
mahesh fans fires on samantha
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో పట్టుకుంటూ హీరోయిన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి.

అప్పట్లో సమంతపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. సమంత భర్త అక్కినేని నాగ చైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్.. చైతు పాదాల దగ్గర ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది.

అంతేకాదు తన మొహాన్ని మొత్తం చైతు పాదాల మీద పెట్టి తన్మయత్వం చెందే సీన్ ఒకటి ఈ పాటలో దర్శనమిచ్చింది. వీటిని తీసుకొని ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. ఆరోజు మహేష్ సినిమా పోస్టర్ చూసే అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూ అంతకన్నా ఎక్కువగా అనుతో చేయించుకోవడానని ఏమనాలో చెప్పాలంటూ సమంతని నిలదీస్తున్నారు. సమంత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. మరి తనను తాను ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి!

loader