సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల మహేష్ బాబు క్లాస్ టచ్ తో ఉన్న సినిమాలు ఎక్కువగా చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల మహేష్ బాబు క్లాస్ టచ్ తో ఉన్న సినిమాలు ఎక్కువగా చేశారు. మహేష్ ఫ్యాన్స్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ కోరుకుంటున్నారు. వారి ఆకలి తీర్చేందుకు డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాటతో ముందుకు రాబోతున్నారు. 

పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు ఫుల్ మాస్ వైబ్స్ తో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో సర్కారు వారి పాటపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 2న చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ చేసింది. మహేష్ బాబు ట్రైలర్ లో డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ తో అదరగొట్టేస్తున్నాడు. అభిమానులు పండగ చేసుకునే విధంగా సర్కారు వారి పాట ట్రైలర్ ఉంది అని చెప్పొచ్చు. 

దీనితో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సర్కారు వారి పాట ట్రైలర్ ని హైదరాబాద్ కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో ప్రదర్శించారు. అక్కడ ఫ్యాన్స్ సృష్టించిన హంగామాతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొంతమంది అభిమానులు గాయపడ్డట్లు కూడా తెలుస్తోంది. 

ట్రైలర్ చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. దీనితో రద్దీ ఎక్కువగా మారింది. పైగా ఫ్యాన్స్ ఒక రేంజ్ లో రచ్చ చేయడంతో అద్దాలు పాడయ్యాయి. మహేష్.. విలన్స్ కి వార్నింగ్ ఇస్తున్న విధానం.. కీర్తి సురేష్ తో రొమాంటిక్ కామెడీ, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ ప్రతి అంశం సూపర్బ్ అనిపించేలా ఉంది. 'నా స్నేహాన్ని దొంగిలించగలరు, నా ప్రేమని దొంగిలించగలరు.. కానీ నా డబ్బుని దొంగిలించలేరు' అంటూ మహేష్ చెబుతున్న డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. సముద్ర ఖని ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. 

తమన్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.