సినిమాలకు, ఫ్యామిలీకి ఈ రెండింటికి సమానంగా విలువిస్తాడు సూపర్ స్టార్ మహేష్. ఒక రకంగా ప్యామిలీకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తాడు.
మహేష్ బాబు.. ఎప్పుడూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు. వరుసగా ఫారెన్ టూర్లు వేస్తుంటాడు. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా.... తాను అనుకున్న పనిమాత్రం చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ టూర్ల విషయంలో మహేష్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కలర్లేదు. తన ఫ్యామిలీ కి సంబంధించి.. మరీ ముఖ్యంగా సితార పాప గురించ చెప్పడానికి బాగా ఇష్టపడుతుంటుంది. ఈక్రమలో మహేష్ తో కలిసి సితార కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
తన తండ్రి మహేష్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది సితార పాప.. లేటెస్ట్ గా మహేష్ కూతురు సితార ఘట్టమనేని ఈ ఫాథర్స్ డే సందర్భంగా అయితే మహేష్ తో కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే షేర్ చేసుకొని ఈ ఫాథర్స్ డే విషెష్ ని మహేష్ కి చెప్పింది. నా సూపర్ డాడ్ నా చీర్ లీడర్ అంటూ మా నాన్నకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పోస్ట్ పెట్టింది. దీనితో ఈ పిక్స్ లో మహేష్ సితారలు తమ హ్యాపీ మూమెంట్స్ ని గడుపుతూ ఉండగా ఈ పిక్స్ చూసిన మహేష్ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు త్రివిక్రమ్ తో అయితే “గుంటూరు కారం” సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. అది కూడా కాస్త బ్రేక్ ఇచ్చి.. తాజాగా టూర్ వెల్ళి వచ్చాడు మహేష్. సినిమా షూట్కు గ్యాప్వచ్చినా పర్లేదు కాని.. తన ఫ్యామిలీ టూర్ మాత్రం మిస్ అవ్వడు మహేష్. ఇక గుంటూరు కారం సినిమా షూట్ గ్యాప్ లో అయితే ప్రతి నిమిషాన్ని మహేష్ మహేష్ తన కుటుంబంతోనే గడిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ కి తన హ్యాపీ ఫామిలీ టైం అయితే మరింత ఆనందం కలిగిస్తుంది.
