మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో సితార కూడా మెరిసింది. తాజాగా విడుదల చేసిన పెన్నీ సాంగ్ ప్రోమోలో సితార డాన్స్ తో అదరగొట్టింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు మాస్ యాటిట్యూడ్ తో నటిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ మూవీ. దీనితో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మహేష్ కి జోడిగా ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తోంది.
సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు నెమ్మదిగా జోరందుకుంటున్నాయి. ఆ మధ్యన విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ 'కళావతి' యూట్యూబ్ లో సునామి సృష్టిస్తోంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. 'పెన్నీ' అంటూ సాగే ఈ సాంగ్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్.
ఈ సాంగ్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు.. సితార కూడా మెరిసింది. తండ్రీ కూతుళ్లు ఇద్దరూ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. ముఖ్యంగా సితార స్టైల్, డ్యాన్స్, యాటిట్యూడ్ చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. తమన్ అందించిన మ్యూజిక్ ఒకెత్తైతే.. ఈ సాంగ్ లో సితార డ్యాన్స్ మరో ఎత్తు. థియేటర్స్ లో ఈ సాంగ్ కి మాస్ జాతర పక్కా అని చెప్పొచ్చు.
చూస్తుంటే తమన్ సూపర్ ఫామ్ ఇప్పట్లో ఆగేలా లేదు. సాంగ్ లో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మార్చి 20న 'పెన్నీ' పూర్తి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో దున్నేయడం ఖాయం.
మే 12న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే ఈ చిత్ర కథ ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

