సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ముద్దుల తనయ సితార తన ఇంట్లో సందడి చేస్తుంది. స్కూల్స్ లేకపోవడంతో ఇంట్లోనే సరదాగా గడిపేస్తుంది. మొన్నటి వరకు ఫాదర్‌ మహేష్‌బాబు, అన్నయ్య గౌతమ్‌లతో ఆడుతూ పాడుతూ గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను మహేష్‌బాబు తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకున్నారు. 

తాజాగా సితార తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ లెహంగా ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ సితార ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది మొత్తం కొత్త బట్టలతో, తనకిష్టమైన బ్రైట్‌ కలర్‌ దుస్తులు ధరించడంతో సాగిందని తెలిపింది. తన కోసం ఈ లెహంగాని తయారు చేసిన మధూస్‌ క్లాసిక్‌ వారికి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది.

మరోవైపు సితార మమ్మి, నటి నమ్రత శిరోద్కర్‌ సైతం ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో సితార బెడ్‌పై దుప్పటి కప్పుకుని నవ్వుతూ ఉంది. ఈ ఫోటో సైతం ముచ్చటగా ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

This little cub is all tucked in 😍😍#cocoon #sweetdreams ❤️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Oct 16, 2020 at 10:44am PDT