మ‌హేశ్ బాబు, కొర‌టాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోన్న‌ 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించి 'ది విజన్‌ ఆఫ్‌ భరత్' పేరిట నిన్న టీజ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనబ‌డుతూ, త‌నదైన శైలిలో చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఈ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత పెంచేసింది. కాగా, ఈ టీజ‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లోనే కోటి 11 లక్షల డిజిటల్ వ్యూస్ సాధించింది. కానీ లైక్స్ విషయంలో మాత్రం వెనకపడ్డాడు ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మ‌హేశ్ స‌ర‌స‌న‌ కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది.