సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మాస్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. బాక్సాఫీసు కలెక్షన్లలోనూ అదరగొడుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్ అందింది. 

దర్శకుడు పరుశురాం పెట్ల, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). దాదాపు రెండేండ్ల తర్వాత మహేశ్ బాబు ఈ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టాడు. మే 12 నుంచి సర్కారు వారి పాట థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ కొనసాగుతోంది. తొలిరోజు కొంత మిశ్రమ స్పందన వచ్చినా.. ప్రస్తుతం థియేటర్ల వద్ద సర్కారు వారి పాట సందడి నెలకొంది. తొలి రెండు షోలకు థియేటర్లు మొత్తం నిండిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వసూళ్లలోనూ అదరగొడుతోంది.

కేవలం రెండు రోజుల్లో సర్కారు వారి పాట చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ రాబట్టి.. రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.103 కోట్ల గ్రాస్ ను సాధించింది. అటూ యూస్ లోనూ రూ.1 మిలియన్ గ్రాస్ వసూళ్లు సాధించినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. సమ్మర్ సీజన్ లో ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బాస్టర్ క్రియేట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డను ను సొంతం చేసుకున్నట్టు మేకర్స్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై తాజాగా మరో అప్డేట్ అందింది. 

అయితే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ డీల్ కుదుర్చుకుని మూవీ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. దీంతో థియేట్రికల్ రన్ పూర్తైన నాలుగు వరాల తర్వాత ఓటీటీలోకి ‘సర్కారు వారి పాట’ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంటే జూన్ మొదటి లేదా రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

బ్యాకింక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. చిత్రంలో వెన్నెల కిశోర్, విలన్ పాత్రలో సముద్రఖని నటించారు.