సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తైయ్యింది. ఒక చివరిగా సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉండగా.. తాజాగా చిత్రీకరణను ప్రారంభించినట్టు అప్డేట్ అందించారు మేకర్స్.
బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి గీతా గోవిందం చిత్ర ఫేమ్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల (Parusuram Petla) దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కథనాయికగా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ‘కళావతి’, ‘పెన్నీ’ సాంగ్స్ ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కాగా, ఈ మూవీ చిత్రీకరణ భాగం ఇప్పటికే పూర్తయ్యింది. చివరి సాంగ్ ఒక్కటే షూట్ చేయాల్సి ఉంది. తాజాగా మేకర్స్ ఆ సాంగ్ షూటింగ్ ను ప్రారంభించారు. ఈ మేరకు అప్డేట్ అందించారు. ‘మేము SarkaruVaariPaata చివరి పాట చిత్రీకరణను ప్రారంభించాం. ఈ షూట్ పూర్తి కాబోతోంది. చిత్ర షూటింగ్ నుంచి ఫ్యాన్స్ కోసం బీటీఎస్ పిక్స్ ను విడుదల చేస్తాం’ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే తమ సినిమా రీచ్ కోసం అభిమానులు, ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ ఈ చిత్రం దుమ్ములేపుతోంది. మహేశ్ గెటప్ కొత్తగా కనిపిచడం, పరుశురామ్ పెట్ల దర్శక ప్రతిభతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
