సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రంతో మరో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్ నుంచి అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాల ప్లాన్ చేస్తున్నారు. 14 రీల్స్ పతాకం పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతానికి మహేష్ అనిల్ రావిపూడి చిత్రాన్ని మాత్రమే ఖరారు చేశాడు. తదుపరి చిత్రాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, మహేష్ బాబు కోసం ఓ మల్టీస్టారర్ కథ సిద్ధం అవుతున్నట్లు ఈ వార్తల సారాంశం. 

విజయ్ దేవరకొండ మహర్షి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిధిగా హాజరయ్యాడు. ఆ వేడుకలో తాను మహేష్ బాబుకు వీరాభిమానిని అని విజయ్ దేవరకొండ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మహర్షి ప్రమోషన్స్ లో మహేష్ బాబుకు మల్టీస్టారర్ చిత్రాల గురించి ప్రశ్న ఎదురైంది. ఆ సంధర్భంగా మహేష్ మాట్లాడుతూ మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అంత సులువు కాదు. దానికి అన్నీ కుదరాలి. మల్టీస్టారర్ చిత్రం ఒకే కావాలంటే అది దర్శకుడుపైనే ఆధారపడి ఉంటుంది అని మహేష్ తెలిపాడు.