సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ చిత్ర  షూటింగ్ ను రెండు  రోజుల కిందనే పూర్తి చేసుకున్నారు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేశారు. అయితే ఈ ట్రిప్  లో ఎస్ఎస్ రాజమౌళి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.  

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) కేవలం మూడు వారాల్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది పోయింది పోయి.. ఏకంగా దుబాయ్ కి పయనమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరినీ షాక్ కి గురిచేశాడు మహేశ్ బాబు. దీంతో మహేశ్ బాబు ఏం చేయబోతున్నాడని అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ, ఆత్రుత పెరిగింది. 

మరోవైపు ఇప్పటికీ సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన కనీస గ్రౌండ్ లెవల్ ప్రమోషన్ ను కూడా ప్రారంభించలేదు చిత్ర బృందం. రెండు రోజుల కిందనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న మహేశ్ బాబు సడెన్ గా ఇలా ట్రిప్ క్ వెళ్లడం పట్ల అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా సర్కారు వారి పాట డబ్బింగ్ సెషన్స్ మరియు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. 

ఇలాంటి మహేశ్ హఠాత్తుగా దుబాయ్ ట్రిప్‌కి కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. చిన్న ట్రిప్‌నా.. లేక వెకేషన్‌కు వెళ్తున్నారా.. అని అభిమానులు సందేహిస్తున్నారు. అయితే మహేష్‌ బాబుతో పాటు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కూడా అదే ఫ్లైట్‌లో దుబాయ్‌కి వెళ్తున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మహేష్ మరియు రాజమౌళి కాంబోలో రాబోతున్న భారీ వెంచర్ కథనం కోసం దుబాయ్‌లో కలిసే అవకాశం ఉంది. దీంతో ఈ ట్రిప్ తర్వాత మహేశ్ బాబు ట్రిప్ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. 

మే 12న సర్కారు వారి పాట గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ఈ రోజు దుబాయ్ కి వెళ్లి మే 3న తిరిగి హైదరాబాద్ కు రానున్నట్టు తెలుస్తోంది. మహేశ్ వచ్చాకే ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కాగా, బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.