ప్రోమో అదిరిందిగా... గుంటూరు కారం అప్డేట్ ఇచ్చిన మహేష్..!
మహేష్ బాబు స్వయంగా గుంటూరు కారం అప్డేట్ ఇచ్చాడు. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందని తెలియజేశాడు. గుంటూరు కారం సాంగ్ ప్రోమో ఆకట్టుకుంది.

గుంటూరు కారం మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి విడుదలని ప్రకటించిన నేపథ్యంలో చకచకా పూర్తి చేస్తున్నారు. మహేష్ బాబు-త్రివిక్రమ్ దాదాపు 13 ఏళ్ల అనంతరం కొలాబరేట్ అయ్యారు. వీరి కాంబోలో తెరకెక్కిన చివరి చిత్రం ఖలేజా 2010లో విడుదలైంది. గుంటూరు కారం హ్యాట్రిక్ మూవీ. ఈ చిత్ర షూటింగ్ సవ్యంగా సాగలేదు. పలుమార్లు వాయిదా పడటంతో పాటు పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. టెక్నీషియన్స్ కూడా ప్రాజెక్ట్ మధ్యలో వెళ్లిపోయారు.
త్రివిక్రమ్-మహేష్-థమన్ మధ్య విభేదాలంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గుంటూరు కారం సంక్రాంతికి రావడం కష్టమే అన్న మాట వినిపించింది. అయితే నిర్మాత నాగ వంశీ ఖచ్చితంగా గుంటూరు కారం సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఇక గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిటింగ్. ఎట్టకేలకు ప్రోమో విడుదల చేశారు.
దమ్ మసాలా అనే సాంగ్ త్వరలో విడుదల చేయనున్నారు. మహేష్ క్యారెక్టర్ గురించి చెప్పే మాస్ సోలో సాంగ్ ఇది. దమ్ మసాలా సాంగ్ ప్రోమో మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇది ఆకట్టుకుంటుంది. గుంటూరు కారం జనవరి 12న విడుదల చేస్తున్నట్లు కూడా ప్రోమోలో జోడించారు.
గుంటూరు కారం మూవీలో మహేష్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం.