'మీ స్టైల్ అంటే ఇష్టం..' మహేష్ బాబు ట్వీట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 10:45 AM IST
mahesh babu tweet on photographer avinash
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇతర సినిమాలను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మీ స్టైల్ అంటే ఇష్టమంటూ ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు. 

అసలు విషయంలోకి వస్తే అవినాష్ గోవారికర్ అనే ఫోటోగ్రాఫర్ తో కలిసి మహేష్ తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను అవినాష్ షేర్ చేస్తూ.. 'మహేష్ బాబుతో పోస్ట్ ప్యాకప్ షూట్.. సూపర్ చార్మింగ్, సూపర్ ఫాస్ట్.. సూపర్ స్టార్..' అంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన మహేష్ బాబు.. ''మీ వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. మీతో షూట్ ఎప్పుడూ ఫన్ గానే ఉంటుంది.

ప్రత్యేకమైన మహారాష్ట్ర భోజనాన్ని ఎంజాయ్ చేశాను'' అంటూ ట్వీట్ చేశారు. దీనికి మహేష్ భార్య నమ్రత 'నేను మిస్ అయ్యాను' అంటూ తన భర్త ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader